లవ్ జిహాద్ విషయంలో హిందూ మహిళలు జాగ్రత్తగా ఉండాలి.. రాజాసింగ్
హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.) రాఖీ పండుగ సందర్భంగా హిందూ మహిళలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రత్యేక పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక వీడియో విడుదల చేశారు. రక్షాబంధన్ అనేది అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీక అని, ఈ మేరకు అన్నదమ్ములు
రాజాసింగ్


హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.)

రాఖీ పండుగ సందర్భంగా హిందూ మహిళలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రత్యేక పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక వీడియో విడుదల చేశారు. రక్షాబంధన్ అనేది అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీక అని, ఈ మేరకు అన్నదమ్ములు రక్షణగా నిలవాలని సోదరీమణులు మాట తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే మహిళలు తనకు ఒక మాట ఇవ్వాలని రాజాసింగ్ రిక్వెస్ట్ చేశారు. భారత్లో నేడు లవ్ జిహాద్పై పెద్ద ఎత్తున్న కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి.. లవ్ జిహాద్ వైపు మళ్లీస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే చాలా ఘోరంగా హిందూ అమ్మాయిలను చంపేస్తున్నారని ఆరోపించారు. మొత్తం ముక్కులు ముక్కలుగా నరికి అతి కీరాతకంగా ఫ్రిజ్లో ప్యాక్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది అమాయక హిందూ మహిళలు లవ్ జిహాద్లో చిక్కుకుంటున్నారని ఆవేదన చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande