హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.) దేశ వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు అంబరాన్నంటాయి. తెల్లవారుజాము నుంచే అక్కా, చెల్లెల్లు సోదరులకు రాఖీలు కట్టి మంగళహారతులు పాడుతున్నారు. అనంతరం స్వీట్లు తినిపిస్తూ.. జోరుగా వారి నుంచి కట్నాలు, కానుకలు స్వీకరిస్తున్నారు. ఇక మంత్రి సీతక్క ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ కు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్న, చెల్లెళ్ల మధ్య అనుబంధానికి, ఆప్యాయతకు అద్దంపడుతూ.. ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి పొన్నంకు సీతక్క రాఖీ కట్టగానే.. 'నన్ను ఆశీర్వదించమ్మా' అంటూ ఆయన సీతక్క కాళ్లకు నమస్కారం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..