అమరావతి, 9 ఆగస్టు (హి.స)దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో)భక్తుల లగేజీకి భద్రత కరువైంది. రోజూ వేలమంది భక్తులు దుర్గమ్మ దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వస్తూ ఆలయంలో తమ బ్యాగులకు కనీస భద్రత లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ ప్రతం విశిష్టత సందర్భంగా వేలాది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చారు. దేవస్థానంలో కొండపైన ఒకటి, కొండ దిగువన ఒకటి లగేజీ బ్యాగులు భద్రపరచుకునే పాయింట్లు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ