రేపు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ.. వారిపై చర్యలు ఉండేనా?
హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.) ఎంపీ, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఆదివారం ఉ.11 గంటలకు కీలక భేటీ జరగనుంది. ఇటీవల అసంతృప్తి ఎమ్మెల్యేపై వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్లో కొండా మురళి ఇష్యూ
కాంగ్రెస్


హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.)

ఎంపీ, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఆదివారం ఉ.11 గంటలకు కీలక భేటీ జరగనుంది. ఇటీవల అసంతృప్తి ఎమ్మెల్యేపై వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్లో కొండా మురళి ఇష్యూ, గజ్వేల్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు అంశం, మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్పై విమర్శలు.. వీటిపై రేపు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎవరిపై చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande