కేటీఆర్కు రాఖీ కట్టని కవిత.. పండుగ వేళ ఎందుకీ ఎడబాటు?
హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.) రాష్ట్రమంతా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకుంటుండగా.. ప్రతీ రాఖీకి తమ అనుబంధాన్ని చాటే అన్నా చెల్లెళ్లు మాత్రం దూరంగా ఉన్నారు. ప్రతి ఏటా అన్నకు క్రమం తప్పకుండా రాఖీ కట్టే చెల్లెమ్మ.. ఈ సారి ఎడబాటును చూడాల్సిన పరిస్థితి వచ్చ
కేటీఆర్


హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.)

రాష్ట్రమంతా రాఖీ పౌర్ణమి వేడుకలు

జరుపుకుంటుండగా.. ప్రతీ రాఖీకి తమ అనుబంధాన్ని చాటే అన్నా చెల్లెళ్లు మాత్రం దూరంగా ఉన్నారు. ప్రతి ఏటా అన్నకు క్రమం తప్పకుండా రాఖీ కట్టే చెల్లెమ్మ.. ఈ సారి ఎడబాటును చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కేటీఆర్ కవితల మధ్య ఏ ఏడాది లేనంత దూరం పెరిగినట్లు కనిపిస్తోంది.

రాఖీ పౌర్ణమి సందర్భంగా.. అన్నకు రాఖీ కట్టేందుకు వస్తానంటే తాను హైదరాబాద్ లో లేనని, కలవలేనని చెప్పినట్లుగా కవిత సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. రాఖీ సెలబ్రేషన్స్ గురించి కొందరు విలేకరులు ఆమెను అడగ్గా.. అన్న కేటీఆర్ బెంగళూరులో ఉన్నట్లు చెప్పారని, ప్రస్తుతం తాను హైదరాబాద్ లో అందుబాటులో లేనని మెసేజ్ పెట్టారని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande