తెలంగాణ, కరీంనగర్. 9 ఆగస్టు (హి.స.)
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని వెన్కేపల్లి- సైదాపూర్ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. చెప్పులను లైనులో ఉంచి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. శుక్రవారం రాత్రి సహకారం సంఘానికి 250 బస్తాల యూరియా వచ్చింది. దీంతో శనివారం ఉదయం పలు గ్రామాల రైతులు సొసైటీ వద్దకు చేరుకుని తమ చెప్పులను క్యూ లైన్లో పెట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావడంతో పోలీస్ పహార నడుమ యూరియా అందించారు. ఒక్కొక్కరికి 2 బస్తాల చొప్పున సహకార సంఘం సిబ్బంది పంపిణీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు