చిన్నారులతో రాఖీ పండుగ: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
తెలంగాణ, సూర్యాపేట. 9 ఆగస్టు (హి.స.) సూర్యాపేట జిల్లా బాలభవన్ లో చిన్నారులతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శనివారం రాఖీ పండుగను జరుపుకున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకైన ఈ పండుగ సందర్భంగా, చిన్నారులు కలెక్టర్ కు రాఖీలు కట్టి ఆ
సూర్యాపేట కలెక్టర్


తెలంగాణ, సూర్యాపేట. 9 ఆగస్టు (హి.స.)

సూర్యాపేట జిల్లా బాలభవన్ లో చిన్నారులతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శనివారం రాఖీ పండుగను జరుపుకున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకైన ఈ పండుగ సందర్భంగా, చిన్నారులు కలెక్టర్ కు రాఖీలు కట్టి ఆప్యాయతను పంచారు. చిన్నారులు బాగా చదివి ప్రయోజకులుగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. వారికి బట్టలు, ఆటవస్తువులు, మిఠాయిలు, బహుమతులు అందజేశారు. 2 నెలల్లో నూతన చిల్డ్రన్ హోమ్ పూర్తవుతుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande