స్పెషల్ బస్సుల్లో మాత్రమే అదనపు చార్జీలు..: టీజీఎస్ ఆర్టీసీ
హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.) రాఖీపౌర్ణమికి స్పెషల్ బాదుడుపై టీజీఎస్ ఆర్టీసీ వివరణ ఇచ్చింది. నిర్వహణ ఖర్చుల నిమిత్తం స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలు పెంచినట్లు తెలిపింది. ఈ నెల 11 వరకు స్పెషల్ బస్సుల్లో చార్జీలు పెంచినట్లు వెల్లడించింది. ఆ తర్వాత చ
టీజీఎస్ ఆర్టీసీ


హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.) రాఖీపౌర్ణమికి స్పెషల్ బాదుడుపై టీజీఎస్ ఆర్టీసీ వివరణ ఇచ్చింది. నిర్వహణ ఖర్చుల నిమిత్తం స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలు పెంచినట్లు తెలిపింది. ఈ నెల 11 వరకు స్పెషల్ బస్సుల్లో చార్జీలు పెంచినట్లు వెల్లడించింది. ఆ తర్వాత చార్జీలు సాధారణంగానే ఉంటాయని పేర్కొంది. రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నామని, ప్రయాణికులు లేకున్నా బస్సులను వెంటనే తిరిగి తీసుకురావాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో నిర్వహణ ఖర్చుల నిమిత్తం స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలు పెంచామని ఓ ప్రకటనలో వెల్లడించింది.

రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం రాఖీ పండుగకు నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో మాత్రమే కి. మీ కు రూ.1.50 వరకు టికెట్ ధరలను సవరించింది. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేసింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande