హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.) నాలుగైదు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పీఏసీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. శనివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 23 నుంచి కాంగ్రెస్ పాదయాత్ర పున:ప్రారంభమవుతుందని, ఖర్గే సూచన మేరకే పాదయాత్ర చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పాదయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ పాదయాత్ర తనదని, కొందరు కావాలని మీనాక్షి పాదయాత్రగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదట బస్సు యాత్ర చేయాలని అనుకున్నామని, తర్వాత పాదయాత్రగా మార్చామన్నారు. భారత్ జోడో యాత్ర తలపించేలా పాదయాత్ర జరిగిందన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో మా కమిట్మెంట్ను శంకిచాల్సిన అవసరం లేదనన్నారు.
గుజరాత్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశాలో ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. జంతర్ మంతర్ ధర్నాకు షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సి ఉండగా.. రాంచీ పర్యటన లేటవ్వడంతో రాలేకపోయారని వివరణ ఇచ్చారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకమని, కిషన్ రెడ్డికి బీసీల గురించి తెలియదని, బీసీల రిజర్వేషన్ అడ్డుకోవాలని కిషన్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈటల రాజేందర్, బండి సంజయ్ మాట్లాడాలని ఆయన కోరారు. కిషన్ రెడ్డి భయంతో బండి సంజయ్, ఈటల మాట్లాడడం లేదన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ, కేంద్రంలో బిల్లు పాస్ చేయనివ్వడం లేదన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..