తెలుగింటి ఆడపడుచులు, అక్కాచెల్లెళ్లకు రాఖీ శుభాకాంక్షలు : సీఎం చంద్రబాబు
Andhra Pradesh, 9 ఆగస్టు (హి.స.) తెలుగింటి ఆడపడుచులు, అక్కాచెల్లెళ్లకు సీఎం చంద్రబాబు నాయుడు రాఖీ పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. అందరికీ అన్నగా రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరికీ రక్షణ కల్పించి, అందరి జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత
చంద్రబాబు నాయుడు


Andhra Pradesh, 9 ఆగస్టు (హి.స.)

తెలుగింటి ఆడపడుచులు, అక్కాచెల్లెళ్లకు సీఎం చంద్రబాబు నాయుడు రాఖీ పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. అందరికీ అన్నగా రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరికీ రక్షణ కల్పించి, అందరి జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత తనదని పేర్కొన్నారు. ఆడబిడ్డల బాగు కోసం అహర్నిశలు పనిచేస్తానని హామీ ఇచ్చారు.

అలాగే.. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా డెవలప్ చేసి.. ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నిపాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఏడాది సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యల్ని వివరించి మున్ముందు చేపట్టే కార్యక్రమాలపై నేడే నిర్ణయాలు ప్రకటిస్తామన్నారు. ఆదివాసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande