హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలో రాఖీ పండగ సందడి కొనసాగుతోంది. రాఖీ కట్టేందుకు పెద్ద ఎత్తున అక్కా చెల్లెళ్లు తమ సోదరులు ఉంటున్న ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, లింగంపల్లి, ఎర్రగడ్డ ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనదారులు పలు చోట్ల అర కిలోమీటర్ ప్రయాణానికి 40 నిమిషాల సమయం పడుతుండటంతో పండగ పూట అక్కాచెల్లెళ్లు అవస్థలు పడుతున్నారు. మరో పైపు ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. జూబ్లీబస్టాండ్, జేపీఎస్ నుంచి మహిళలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు భారీగా తరలివస్తున్నారు. 'రాఖీ స్పెషల్' పేరుతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..