అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.) :ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు ప్రభుత్వం ఐదుగురు డైరెక్టర్లను నియమించింది. ఈ సంస్థ ఛైర్మన్‌గా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన డేగల ప్రభాకర్‌ను ఇంతకుముందే నియమించారు. తాజాగా కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గానికి చెందిన బాలభారతి మట్టపర్తి, విజయవాడ సెంట్రల్‌కు చెందిన జలకం రాజారావు, ఆత్మకూరు నుంచి కటారి రమణయ్య, కర్నూలుకు చెందిన మనోజ్‌కుమార్ భీమిశెట్టి, మైదుకూరు నియోజకవర్గానికి చెందిన పండిటి మల్హోత్రాలను డైరెక్టర్లను నియమిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ