హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)
సికింద్రాబాద్ జేపీఎస్ బస్డాండ్ వద్ద కూల్చివేసిన షాపుల స్థానంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి పేదలకు ఇస్తామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తాను కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడానని కేంద్రం ఎవరి ఉపాధిని దూరం చేయదన్నారు. కంటోన్మెంట్ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని జేబీఎస్ బస్టాండ్, ఎరుకల బస్తీలో కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచి భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జేబీఎస్ వద్ద కూల్చివేతలను పరిశీలించిన ఈటల రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ భూమి కంటోన్మెంట్ కు చెందిందన్నారు. ఇక్కడ 35 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని అందువల్ల ఇక్కడ షాప్ కోల్పోయిన వారికి తిరిగి ఇక్కడే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఉపాధి మార్గం చూపిస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..