కడప, 10 సెప్టెంబర్ (హి.స.), కొండాపురం- కరోనాకు ముందు పలు రైల్వే స్టేషన్లలో ఉన్న స్టాపింగ్‌లను ఎట్టకేలకు పునరుద్ధరించారు. ఈ మేరకు రైల్వే అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఈ నిర్ణయంతో వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన ఎర్రగుంట్ల, కొండాపురం, నందలూరు, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల వాసుల ప్రయాణానికి ఉపశమనం కలగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ