పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. ఆలేరు ఎమ్మెల్యే
యాదాద్రి భువనగిరి, 10 సెప్టెంబర్ (హి.స.) ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఈ రోజు వారు యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలంలోని వర్టూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే
ఆలేరు ఎమ్మెల్యే


యాదాద్రి భువనగిరి, 10 సెప్టెంబర్ (హి.స.)

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఈ రోజు వారు యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలంలోని వర్టూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలోని దళిత వాడలో సుమారు 25 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల భూమిపూజ చేశారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande