నారాయణపేట, 10 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ
వర్ధంతి సందర్భంగా బుధవారం నారాయణపేట జిల్లా మక్తల్ లోని తన నివాసంలో మంత్రి వాకిటి శ్రీహరి ఆమె చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శమని భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మను మంత్రి వాకిటి శ్రీహరి స్మరించారు. భూస్వాములకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన వీరనారి తెలంగాణ ఆడబిడ్డ చాకలి ఐలమ్మ త్యాగం చిరస్మరణీయం. ఆమె పోరాట స్ఫూర్తి భావి తరాలకు ప్రేరణ అని ఆయన అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..