ఆసియా కప్లో నేడే భారత్ తొలి పోరు.. పసికూన యూఏఈ తో ఢీ..
హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 10న) తమ తొలి పోరులో యూఏఈతో టీమిండియా ఆడనుంది. టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్కు.. యూఏఈపై గెలవడం పెద్ద కష్టం కాదు. కానీ, టీ20ల్లో ఏ జట్టునూ మరీ తక్కువ అంచనా వేయడానికి అవకా
ఆసియా కప్


హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 10న) తమ తొలి పోరులో యూఏఈతో టీమిండియా ఆడనుంది. టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్కు.. యూఏఈపై గెలవడం పెద్ద కష్టం కాదు. కానీ, టీ20ల్లో ఏ జట్టునూ మరీ తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు. యూఏఈ ఇటీవల బంగ్లాదేశ్పై టీ20 సిరీస్ గెలవడం అందరికి తెలిసిందే. పాకిస్థాన్తో కీలక పోరు ముందు భారత్ అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక, జట్టు కూర్పు పరంగా తనను తాను పరీక్షించుకోవడానికి టీమిండియా ఈ మ్యాచ్ ను వినియోగించు కోవాలనుకుంటోంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande