బిజెపి ఎప్పుడూ నిరుద్యోగుల పక్షమే.. బండి సంజయ్
హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేక బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు లక్షలాది మంది నిరుద్యోగ యువతను మోసం చేశాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇవాళ గ్రూప్ -1 అ
బండి సంజయ్


హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)

ఒక్క పరీక్షను కూడా సక్రమంగా

నిర్వహించలేక బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు లక్షలాది మంది నిరుద్యోగ యువతను మోసం చేశాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇవాళ గ్రూప్ -1 అభ్యర్థులు బండి సంజయ్ ను కలిశారు. గ్రూప్-1 ఫలితాలపై తాము చేసిన పోరాటాలకు గతంలో మద్దతు తెలిపినందుకు బండి సంజయ్ కు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. బీజేపీ ఎప్పుడు నిరుద్యోగుల పక్షం నిలుస్తుందని చెప్పారు. భవిష్యత్ లో నిరుద్యోగులకు అవసరమైన న్యాయ పోరాటం కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.

కాగా, ఈ ఏడాది మార్చి 10న విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాలను, మార్చి 30 ప్రకటించిన జనరల్ ర్యాంకులను హైకోర్టు నిన్న రద్దు చేసిన సంగతి తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande