ఇది మాయాజాలం కాదు.. కేసీఆర్ దూరదృష్టి: హరీశ్రావు ఆసక్తికర ట్వీట్
హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణలో శిశు మరణాల రేటు రికార్డు స్థాయిలో తగ్గినట్లుగా తాజాగా నివేదికలు వెలువడ్డాయి. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక-2023 ప్రకారం.. 2013లో దేశవ్యాప్తంగా 40 పాయింట్లుగా ఉన్న శిశు మరణాల రేటు 2023 నాటికి 25 ప
హరీష్ రావు


హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణలో శిశు మరణాల రేటు

రికార్డు స్థాయిలో తగ్గినట్లుగా తాజాగా నివేదికలు వెలువడ్డాయి. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక-2023 ప్రకారం.. 2013లో దేశవ్యాప్తంగా 40 పాయింట్లుగా ఉన్న శిశు మరణాల రేటు 2023 నాటికి 25 పాయింట్లకు తగ్గింది. తెలంగాణలో ఈ రేటు 18గా నమోదైంది. ఇది జాతీయ సగటు కంటే మెరుగైన వృద్ధి రేటు సాధించినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో భారీగా తగ్గిన శిశు మరణాల రేటుపై మాజీ మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.

2011-13లో తెలంగాణ శిశు మరణాల రేటు (IMR) 41.2గా ఉండగా, 2021-23 నాటికి అది 18కి పడిపోయిందని తెలిపారు. ఇది చారిత్రాత్మకమైన 52 శాతం తగ్గుదలను సూచిస్తుందని అన్నారు. ఇది మాయాజాలం కాదని.. కేవలం కేసీఆర్ దూరదృష్టి మాత్రమేనని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, తల్లి, బిడ్డ సంక్షేమ చర్యలు వేలాది ప్రాణాలను కాపాడాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఖాళీ వాగ్దానాలతో ప్రజలను మోసం చేసినప్పటికీ.. కేసీఆర్ దేశం గర్వించేలా ఉత్తమ ఫలితాలను అందించారని.. ఇదే నిజమైన తెలంగాణ మోడల్ అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande