గచ్చిబౌలిలో రూ.11 కోట్ల విలువైన పార్క్ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో 600 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. బహిరంగ మార్కెట్లో ఈ స్థలం విలువ సుమారు రూ.11 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. తెలంగాణ సెక్రటేరియట్ మ్యూచ్యువల్ ఎయిడెడ్ కోపరేటివ్ సొసైటీకి చెందిన 24 ఎకర
హైడ్రా


హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)

శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో 600 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. బహిరంగ మార్కెట్లో ఈ స్థలం విలువ సుమారు రూ.11 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. తెలంగాణ సెక్రటేరియట్ మ్యూచ్యువల్ ఎయిడెడ్ కోపరేటివ్ సొసైటీకి చెందిన 24 ఎకరాల లేఔట్లో రెండు పార్కుల చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. హెచ్ఎండీఏ అనుమతి పొందిన ఈ లేఔట్లో పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను సొసైటీ నిర్వాహకులు అమ్మినట్టు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో హైడ్రా ఆ స్థలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. పార్కుల స్థలాలుగా నిర్ధారించుకున్న తర్వాత ఆక్రమణలను తొలగించి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఈ మేరకు హైడ్రా పరిరక్షించిన పార్కు స్థలంగా పేర్కొంటూ హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేసింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande