జూబ్లీ బస్టాండ్ సమీపంలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేత..
హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న పలు అక్రమ వ్యాపార సముదాయాలను కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ అధికారులు, సిబ్బంది కూల్చివేశారు. జేబీఎస్ నాలా సమీపంలో దుకాణాల సముదాయా
జూబ్లీ బస్టాండ్


హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)

సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్

సమీపంలో ఉన్న పలు అక్రమ వ్యాపార సముదాయాలను కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ అధికారులు, సిబ్బంది కూల్చివేశారు. జేబీఎస్ నాలా సమీపంలో దుకాణాల సముదాయాలు నిర్మించి వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్న వారికి కంటోన్మెంట్ అధికారులు గతంలోనే జారీ చేసిన నోటీసులకు వ్యాపారస్తులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బుధవారం తెల్లవారుజామున జేసీబీల సహాయంతో అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

అక్రమ కట్టడాల కూల్చివేత సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఆయా వ్యాపార సముదాయాల యజమానులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande