మహిళా ధీరత్వానికి ప్రతీక చాకలి ఐలమ్మ.. వర్ధంతి వేళ కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ రైతాంగ పోరాటంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆమె చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, వివిధ పార్టీల నాయకులు ఆమె చిత్రపట
కేటీఆర్


హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ రైతాంగ పోరాటంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆమె చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, వివిధ పార్టీల నాయకులు ఆమె చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. వీరనారి చాకలి ఐలమ్మకు జోహార్లు..! తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి (చిట్యాల) ఐలమ్మ తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవ నిప్పుకణిక ఐలమ్మ, భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి ప్రజా వ్యతిరేక పాలనపై దండెత్తిందని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ పోరాటాలను, త్యాగాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారని పేర్కొన్నారు. బహుజన చైతన్యానికి, మహిళా ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande