హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని, కానీ తమకు అండగా నిలిచిన మాగంటి కుటుంబానికి అండగా నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలను ప్రతి కార్యకర్త తన సొంత పోరాటంగా భావించి పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు.
కాంగ్రెస్ నాయకులు 'హైడ్రా' పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆ డబ్బులతో జూబ్లీహిల్స్ లో ఓట్లు కొనాలని చూస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లను రాయించారని, వాటిని తొలగించే బాధ్యతను బీఆర్ఎస్ నాయకులు తీసుకోవాలని సూచించారు. అక్టోబర్ చివరి వారంలో గానీ, నవంబర్ మొదటి వారంలో గానీ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, బీహార్తో పాటు ఈ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..