మేడారం జాతరపై రాజకీయాలు వద్దు.. గద్దెల మార్పుపై సీతక్క ఆగ్రహం.!
హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) మేడారం మహా జాతర నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం జాతర అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆమె ఆరోపించారు. కానీ ప్రస్తుత
మంత్రి సీతక్క


హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) మేడారం మహా జాతర నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం జాతర అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆమె ఆరోపించారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతర నిర్వహణ, అభివృద్ధి పనులపై ముందుగానే ప్రణాళికలు రూపొందించి, వాటిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సీతక్క తెలిపారు.

మేడారం జాతరలో భక్తులు వేసే కానుకలను, బంగారం, డబ్బును ఉంచే గద్దెల వద్ద కొన్ని మార్పులు చేస్తున్నట్లు సీతక్క వెల్లడించారు. తాము, పూజారులు కలిసి చేసిన మార్పులు సీఎం రేవంత్ రెడ్డికి సంతృప్తి కలిగించలేదని, అందుకే ఆయనే స్వయంగా గద్దెల వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించనున్నారని ఆమె వివరించారు. ఈ నెల 13న లేదా 14న సీఎం మేడారం పర్యటనకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande