పేకాట స్థావరం పై పోలీసుల దాడి.. నలుగురి అరెస్టు
హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) గుట్టుచప్పుడు కాకుండా పేకాట స్థావరం పై ఎస్వోటీ పోలీసులు దాడి చేసిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో గు
పేకాట


హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)

గుట్టుచప్పుడు కాకుండా పేకాట స్థావరం పై ఎస్వోటీ పోలీసులు దాడి చేసిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు మంగళవారం రాత్రి దాడి నిర్వహించారు. ఈ దాడిలో వారి నుంచి రూ.55,000/- నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, బైక్లు స్వాధీనం చేసుకొని నలుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande