అనంతపురంలో కూటమి సభకు సర్వం సిద్ధం.. పరిటాల సునీత ఏమన్నారంటే..
అనంతపురం, 10 సెప్టెంబర్ (హి.స.)అనంతపురం(Ananthapuram)లో ఈ రోజు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే నిర్వహించనున్న సూపర్ సిక్స్-సూపర్ హిట్(Super Six-Super Hit) సభకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు మెరుగైన ఫలితాన్ని రా
పరిటాల సునీత


అనంతపురం, 10 సెప్టెంబర్ (హి.స.)అనంతపురం(Ananthapuram)లో ఈ రోజు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే నిర్వహించనున్న సూపర్ సిక్స్-సూపర్ హిట్(Super Six-Super Hit) సభకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు మెరుగైన ఫలితాన్ని రాబట్టడంతో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababau Naidu)తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక సమీకరణ కోసం భారీగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను కేటాయించారు. దీంతో ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.

అయితే అనంతపురంలో ఏర్పాటు చేసిన సభ‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే పరిటాల సునీత ఈ రోజు ఉదయం సందర్శించారు. సభ ఏర్పాట్లను పరిశీలించారు.

.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పని చేసే చంద్రబాబు వంటి నాయకుడు దొరకడం తమ అదృష్టమని చెప్పారు. కూటమి ప్రభుత్వ పథకాలతో లబ్ది పొందిన వైసీపీ కార్యకర్తలు కూడా బుధవారం జరిగే సభకు భారీగా తరలి వస్తున్నారని పరిటాల సునీత పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande