తిరుమల, 10 సెప్టెంబర్ (హి.స.)తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO)గా ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal) ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.
ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తొలుత స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయనతో ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌తో చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) ప్రయాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగ నాయకుల మండపంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు వేద పండితులు స్వామి ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. ఇక బదిలీపై వెళ్లిన టీటీడీ మాజీ ఈవో శ్యామల రావుకు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా శ్యామల రావు మాట్లాడుతూ.. పూర్వ జన్మ సుకృతం ఉంటే తప్ప తితిదే ఈవోగా పనిచేసే భాగ్యం కలగదని అన్నారు. ముఖ్యంగా తనకు ఈవోగా పనిచేసే అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. 14 నెలల కాలంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చా టీటీడీ మాజీ ఈవో శ్యామల రావు అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి