అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.)
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ట్విటర్ వేదికగా స్పందిస్తూ..“భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ జీకి నా హృదయపూర్వక అభినందనలు. ఆయన సుదీర్ఘ అనుభవం, విశిష్ట నాయకత్వ లక్షణాలు ఉపరాష్ట్రపతి పదవికి మరింత గౌరవాన్ని తీసుకువస్తాయి. రాజ్యసభలో సార్థకమైన, నిర్మాణాత్మక చర్చలకు ఆయన ప్రోత్సాహం కలిగి, ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచే దిశగా ఇది తోడ్పడుతుంది,” అని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి