సీఎం చంద్రబాబు బావిలో దూకి చావాలి : వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులను, వారి సమస్యలను పట్టించుకోవడం లేదని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఏపీలో సంపద సృష్టిస్తానని చెప్పిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు, బెల్లాలకు
జగన్


అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులను, వారి సమస్యలను పట్టించుకోవడం లేదని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఏపీలో సంపద సృష్టిస్తానని చెప్పిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు, బెల్లాలకు అమ్మేస్తున్నారని, ఆయన ఏదైనా బావిలో దూకి చావాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తోంటే అసలు ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. సీఎం సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.

రాష్ట్ర ప్రజలకు సంక్షేమం లేదు.. అభివృద్ధి లేదని, సూపర్ సిక్స్ ను అమలు చేశామని సీఎం అబద్ధాలు చెప్తూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. దోచుకో, పంచుకో, తినుకో అన్న చందంగానే ప్రభుత్వం తీరు ఉందని ధ్వజమెత్తారు. 2019 వరకూ చంద్రబాబు మూడుసార్లు సీఎంగా చేసినా ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, ఆర్టీసీ కాంప్లెక్సులు లేకుంటే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని జగన్ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande