15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం.. హాజరైన పలువురు ప్రముఖులు
న్యూఢిల్లీ, 12 సెప్టెంబర్ (హి.స.) భారత 15వ ఉప రాష్ట్రపతిగా. చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్ ఇవాళ ఉదయం సరిగ్గా 10.11 నిమిషాలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా జాతీయ గీతాలాపన చేసిన తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధాకృష్ణన్తో ప్ర
రాధాకృష్ణన్


న్యూఢిల్లీ, 12 సెప్టెంబర్ (హి.స.) భారత 15వ ఉప రాష్ట్రపతిగా.

చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్ ఇవాళ ఉదయం సరిగ్గా 10.11 నిమిషాలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా జాతీయ గీతాలాపన చేసిన తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధాకృష్ణన్తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంతులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, తాజా మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఇతర ఎన్డీఏ పక్ష నేతలు హాజరయ్యారు. అదేవిధంగా విపక్షం నుంచి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమి సభ్యులు ఈ కార్యక్రామానికి అటెండ్ అయ్యారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ను ఎన్డీఏ పక్ష నేతలు అభినందలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande