న్యూఢిల్లీ, 12 సెప్టెంబర్ (హి.స.) మాజీ ఉప రాష్ట్రపతి జగదీప ధన్కడ్ ఎట్టకేలకు నేడు దర్శనమిచ్చారు. ఉపరాష్ట్రపతి గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారు హాజరయ్యారు. రాజీనామా అనంతరం ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించడం ఇదే తొలిసారి. ప్రొటోకాల్ ప్రకారం.. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధనఖడ్ అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జూలై 21న రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ధనఖడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆయన నిర్ణయం అందరినీ షాక్కు గురి చేసింది. మరో రెండేండ్లు పదవీకాలం ఉండగానే ధనఖడ్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ధనడ్ రాజీనామాపై ప్రతిపక్షాలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..