NTPC సెకండ్ ఫేజ్ పనులకు లైన్ క్లియర్.. పర్యావరణ అనుమతులు జారీ
హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ కు కేంద్ర పర్యావరణ శాఖ తీపి కబురు చెప్పింది. మేరకు ఎన్టీపీసీ (NTPC) ప్రాజెక్టు రెండో దశ పనులకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పెద్దపల్లి జిల్లా రామగుండలో 4 వేల
ఎన్టిపిసి


హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ కు కేంద్ర పర్యావరణ శాఖ తీపి కబురు చెప్పింది. మేరకు ఎన్టీపీసీ (NTPC) ప్రాజెక్టు రెండో దశ పనులకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పెద్దపల్లి జిల్లా రామగుండలో 4 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను నిర్మించి తెలంగాణకు విద్యుత్ సరఫరాల చేయాలని తెలిపింది. ఈ క్రమంలోనే మొదటి ఫేజ్లో 1,600 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను నిర్మించగా.. సెకండ్ ఫేజ్ లో 2,400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల నిర్మాణాలకు భూ సేకరణ, నీరు, బొగ్గు సరఫరాలకు ఒప్పందాలు కుదిరాయి. అయితే, విద్యుత్ కేంద్రాల నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి జనవరి 28న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నుంచి పర్యావరణ అనుమతులకు ప్రతిపాదనలు పంపింది. తాజాగా ఆ ప్రతిపాదనలకు కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో 800 మెగావాటల్ సామర్థ్యంతో మొత్తం 3 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను 2030 నాటికి నిర్మించి యూనిటు 5.4.12 చొప్పున విక్రయించేందుకు అధికారులు కరసత్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande