సూర్యాపేట, 12 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు
అష్టకష్టాలు పడుతున్నారు. రైతులు తెల్లవారు జాము నుంచే విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ వేచి చూసినా ఒకటి, రెండు బస్తాలే ఇస్తున్నారని అసంతృప్తితో వెనుదిరుగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో యూరియా లైన్లు జాతరను తలపిస్తున్నాయి.
కాగా, అర్వపల్లి పీఏసీఎస్కు శుక్రవారం లారీ లోడ్ యూరియా రాగా ఎవ్వరికి సరిపోకపోవడంతో రైతులు అధికారులను ఎన్ని బస్తాలు వచ్చాయని నిలదీయగా పొంతలు లేని సమాధానం చెప్పారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు హైవేపై యూరియా కోసం రైతులు వేచి చూడడం జాతరను తలపించింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎట్టకేలకు పోలీసుల బందో బస్తుల మధ్య యూరియాను సరఫరా చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు