అమరావతి, 12 సెప్టెంబర్ (హి.స.)లిక్కర్ స్కామ్ కేసు (Liquor Scam Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. అనంతరం పోలీసులు ఇవాళ ఆయనను విజయవాడ (Vijayawada)కు తరలిస్తున్నారు. అయితే, లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా ఎంపీ మిథున్ రెడ్డికి ఉప రాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇటీవలే విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ (Delhi)కి వెళ్లిన మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ గడువు నిన్నటితో ముగియడంతో తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. నిన్న గురువారం రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోగా.. నేటితో రిమాండ్ ముగస్తుండటంతో పోలీసులు ఇవాళ మిథున్ రెడ్డిని విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి