చెప్తే వినరు.. గిల్లితే ఏడుస్తారు.. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర విసుర్లు
విజయవాడ, 12 సెప్టెంబర్ (హి.స.)వైసీపీ నేతలు చెప్తే వినరు.. గిల్లితే ఏడుస్తారు.. అనే విధంగా తయారయ్యారని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి నాయకులు సంయమనంతో ఉన్నారు కాబట్టి.. వైసీపీ నేతలు ఇంకా రోడ్లపై తిరుగుత
ravindra


విజయవాడ, 12 సెప్టెంబర్ (హి.స.)వైసీపీ నేతలు చెప్తే వినరు.. గిల్లితే ఏడుస్తారు.. అనే విధంగా తయారయ్యారని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.

విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి నాయకులు సంయమనంతో ఉన్నారు కాబట్టి.. వైసీపీ నేతలు ఇంకా రోడ్లపై తిరుగుతున్నారని కామెంట్​చేశారు. ప్రజల మద్దతు చూసి ఓర్వలేక కూటమిపై జగన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎరువుల పేరుతో రాజకీయం చేయడానికి జగన్ సిగ్గుపడాలన్నారు. అవసరం మేరకు యూరియా సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజల్ని రెచ్చగొట్టడం మాత్రమే లక్ష్యంగా జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నామంటూ జగన్ నీచ ఆరోపణలు చేస్తున్నాడు.. ఐదేళ్లలో జగన్ ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్​చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande