ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో విలువైన పుస్తకాలు కొనుగోలు చేసిన పవన్ కల్యాణ్
ఢిల్లీ , 12 సెప్టెంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఢిల్లీ పర్యటనలో రాజకీయ కార్యక్రమాలతో పాటు తనకున్న పుస్తకాసక్తిని కూడా చాటుకున్నారు. శుక్రవారం ఉదయం నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన, ఆ తర్వాత న్యూఢిల
pawan-kalyan-buys-books-at-delhi-national-school-of-drama


ఢిల్లీ , 12 సెప్టెంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఢిల్లీ పర్యటనలో రాజకీయ కార్యక్రమాలతో పాటు తనకున్న పుస్తకాసక్తిని కూడా చాటుకున్నారు. శుక్రవారం ఉదయం నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన, ఆ తర్వాత న్యూఢిల్లీలోని బహవల్పూర్ హౌస్‌లో ఉన్న ప్రతిష్టాత్మక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్‌డీ ఆవరణలోని పుస్తకాల దుకాణంలో పలు పుస్తకాలను ఆసక్తిగా గమనించి, కొన్ని విలువైన పుస్తకాలను కొనుగోలు చేశారు.

రాజకీయాలతో నిత్యం బిజీగా ఉండే పవన్ కల్యాణ్, కాస్త సమయం దొరకగానే తన అభిమాన అంశమైన పుస్తకాలపై దృష్టి సారించడం అందరినీ ఆకట్టుకుంది. కళలు, నాటకరంగంపై ఆయనకున్న అభిమానానికి ఈ సందర్శన అద్దం పడుతోంది.

అంతకుముందు, భారత 15వ ఉపరాష్ట్రపతిగా సి.పి. రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం పవన్ కల్యాణ్ స్పందించారు.

నూతన ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నాయకత్వం, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల నేతలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తన అపార అనుభవంతో రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి పదవికి గొప్ప గౌరవాన్ని తీసుకువస్తారు. రాజ్యసభలో అర్థవంతమైన చర్చలు జరిగేలా చూస్తారని విశ్వసిస్తున్నాను అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరై శోభను తీసుకువచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande