భీమవరం, 12 సెప్టెంబర్ (హి.స.)తాడేపల్లిగూడెంలో వందేభారత్ (Vande Bharat) హాల్ట్, అత్తిలిలో ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్ట్, అరుణాచలం రైలు ర్వీసుల్ని రెగ్యులర్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు.
శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సారథ్యం - చాయ్ పే చర్చ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav)తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యల్ని అడిగి తెలుసుకుని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రైల్వే, జాతీయ రహదారి నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. నరసాపురంకు వందేభారత్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అలాగే.. జాతీయ రహదారులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చారని, గ్రీన్ ఫీల్డ్ హైవేకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. అతిథి మర్యాదలకు భీమవరం పెట్టింది పేరని కొనియాడారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకోవడమే చాయ్ పే చర్చ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. జీఎస్టీ శ్లాబులను తగ్గించడంతో మధ్యతరగతి కుటుంబాలతో పాటు.. చిన్న వ్యాపారులకు లాభాలు వస్తున్నాయని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి