న్యూఢిల్లీ,19,సెప్టెంబర్ (హి.స.) ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే కలవబోతున్నారు. అక్టోబర్‌లో కౌలాలంపూర్‌లో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోడీ, ట్రంప్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. మలేసియా వేదికగా జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలకు మోడీ రెగ్యులర్‌గా హాజరవుతుంటారు. అయితే ఈసారి ఈ సమావేశాలకు ట్రంప్ కూడా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ-ట్రంప్ కీలక సమావేశం జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో 47వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 26-28 మధ్య ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి అనేక మంది నాయకులు హాజరవుతున్నారు. మోడీ-ట్రంప్ కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఇద్దరి మధ్య సమావేశం ఉంటుందా? లేదా? అనేది ఇరు దేశాల నుంచి ఎలాంటి సమాచారం వెలువడ లేదు. అయితే ప్రస్తుతం సుంకాల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న కారణాన ఇద్దరి మధ్య భేటీ జరగొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ