ఉధంపూర్:న్యూఢిల్లీ,20,సెప్టెంబర్ (హి.స.) జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఒక ఆర్మీ సైనికుడు గాయపడ్డాడు. ప్రస్తుతం భారత్ జరుపుతున్న ఎదురుకాల్పుల్లో జైషే-ఎ-మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు చిక్కుకున్నారు. తొలుత కిష్త్వార్‌లో కాల్పులు జరిగాయని తెలిపిన ఆర్మీ తరువాత ఆపరేషన్ ఉధంపూర్‌కే పరిమితమయ్యిందని పేర్కొంది.
‘ఎక్స్’ పోస్ట్‌లో వైట్ నైట్ కార్ప్స్.. దోడా-ఉధంపూర్ సరిహద్దుల్లో కాల్పులు జరుగుతున్నాయని తెలిపింది. నిర్దిష్ట సమాచారం మేరకు, ఆర్మీ, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ),పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. ఫలితంగా ముష్కరుల నుంచి కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ గాయపడ్డాడు. గత ఏడాది కాలంగా ఈ ప్రాంతంలో పలుమార్లు కాల్పులు జరిగాయి. జూన్ 26న డూడు-బసంత్‌గఢ్ అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హైదర్ హతమయ్యాడు.
ఇతను జైషే మొహమ్మద్‌కు చెందిన టాప్ కమాండర్. గత నాలుగేళ్లుగా ఈ ప్రాంతంలో చురుకుగా పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 25న, బసంత్‌గఢ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒక ఆర్మీ సైనికుడు వీరమరణం పొందారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు