ఢిల్లీ వర్సిటీ ఏబీవీపీదే!
న్యూఢిల్లీ,20,సెప్టెంబర్ (హి.స.): ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూని యన్‌ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు గల ఏబీవీపీ అభ్యర్థి ఆర్యన్‌ మాన్‌ అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ఏడేళ్ల విరామం తర్వాత గత ఏడాది ఈ స్థానాన్ని గెలుచుకున్న ఎన్‌ఎస
ABVP


న్యూఢిల్లీ,20,సెప్టెంబర్ (హి.స.): ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూని యన్‌ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు గల ఏబీవీపీ అభ్యర్థి ఆర్యన్‌ మాన్‌ అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ఏడేళ్ల విరామం తర్వాత గత ఏడాది ఈ స్థానాన్ని గెలుచుకున్న ఎన్‌ఎస్‌యూఐ నుంచి అధ్యక్ష పదవిని ఏబీవీపీ చేజిక్కించుకోవడం విశేషం. ఏబీవీపీ అభ్యర్థి ఆర్యన్‌ మాన్, కాంగ్రెస్‌ అనుబంధ ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థి జోస్లిన్‌ నందిత చౌదరిపై 16,196 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఆర్యన్‌ మాన్‌కు 28,841 ఓట్లు రాగా, ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థి జోస్లిన్‌కు 12,645 ఓట్లు వచ్చాయి. మొత్తం నాలుగు స్థానాలకు గాను.. ఏబీవీపీ అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను గెలుచుకుంది. అయితే ఉపాధ్యక్ష పదవిని కోల్పోయింది. ఏబీవీపీకి చెందిన కునాల్‌ చౌదరి, దీపికా ఝా.. కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులకు ఎన్నికయ్యారు, కాగా ఎన్‌ఎస్‌యూఐకి చెందిన రాహుల్‌ ఝాన్స్‌లా ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు.

స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ), ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌ఏ)లు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి. ఈ ఎన్నికల్లో తమ సంస్థ బాగా పోరాడిందని ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్‌ చౌదరి ఎక్స్‌లో పోస్టు చేశారు. ఏబీవీపీకి వ్యతిరేకంగానే కాకుండా.. ఢిల్లీ పాలన యంత్రాంగం, ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు, ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీ, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా కూడా తాము పోరాడినట్లు స్పష్టం చేశారు. వేలాది మంది ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు తమకు గట్టి మద్దతుగా నిలిచారని, తమ అభ్యర్థులు బాగా పోరాడారని ప్రశంసించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande