న్యూఢిల్లీ,19,సెప్టెంబర్ (హి.స.) పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్-సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం లో ఇతర దేశాలు చేరడానికి తలుపులు మూసివేయబడలేదని పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సౌదీ అరేబియాతో పాకిస్థాన్ నాటో లాంటి ఒప్పందం జరిగిందని గుర్తుచేశారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ నాటోను విస్తరించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ రియాద్‌లో రక్షణ ఒప్పందంపై సంతకం చేశారని చెప్పారు.
ఖవాజా ఆసిఫ్ జియో న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు చేరడానికి ఎల్లప్పుడూ అవకాశం ఉంటుందని సూచించారు. ముస్లిం దేశాలను రక్షించుకోవడం ప్రాథమిక హక్కుగా భావిస్తున్నట్లు చెప్పారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ