యాసిన్ మాలిక్ సంచలన విషయాన్ని వెల్లడించారు.
హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)ఉగ్రవాద నిధుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF) ఉగ్రవాది యాసిన్ మాలిక్ సంచలన విషయాన్ని వెల్లడించారు. 2006లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా(LeT) చీఫ్, 26/11 దాడుల సూత్రధా
యాసిన్ మాలిక్ సంచలన విషయాన్ని వెల్లడించారు.


హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)ఉగ్రవాద నిధుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF) ఉగ్రవాది యాసిన్ మాలిక్ సంచలన విషయాన్ని వెల్లడించారు. 2006లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా(LeT) చీఫ్, 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను కలిసిన తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు వ్యక్తిగతంగా థాంక్స్ చెప్పారని వెల్లడించారు. ఆగస్టు 25న ఢిల్లీ హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో మాలిక్ ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ఉగ్రవాదిని కలవడం తన వ్యక్తిగత చొరవ కాదని, పాకిస్తాన్‌తో తెర వెనక శాంతి ప్రక్రియలో భాగంగా భారత నిఘా అధికారుల అభ్యర్థన మేరకు జరిగిందని చెప్పారు.

అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) స్పెషల్ డైరెక్టర్ వీకే జోషి 2005లో కాశ్మీర్‌లో సంభవించిన భూకంపం తర్వాత పాకిస్తాన్ పర్యటనకు ముందు ఢిల్లీలో తనను కలిసినట్లు మాలిక్ చెప్పారు. పాకిస్తాన్ రాజకీయ నాయకత్వంతోనే కాకుండా, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి సయీద్‌ సహా ఉగ్రవాద వ్యక్తులతో చర్చలు జపడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జోషి కోరినట్లు మాలిక్ చెప్పారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande