హెచ్‌-1బీ వీసాల్లో అమెజాన్‌ టాప్‌.. భారత్‌ కంపెనీలకు ఎన్నంటే..?
వాషింగ్టన్‌:న్యూఢిల్లీ,20,సెప్టెంబర్ (హి.స.) హెచ్‌-1బీ వీసా కోసం కలలు కంటోన్న భారతీయుల నెత్తిన మరో బాంబు పేల్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. హెచ్‌-1బీ వీసా (H-1B visas) దరఖాస్తులపై వార్షిక రుసుమును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ ఎగ్జిక్యూటివ్‌
Amazon


వాషింగ్టన్‌:న్యూఢిల్లీ,20,సెప్టెంబర్ (హి.స.) హెచ్‌-1బీ వీసా కోసం కలలు కంటోన్న భారతీయుల నెత్తిన మరో బాంబు పేల్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. హెచ్‌-1బీ వీసా (H-1B visas) దరఖాస్తులపై వార్షిక రుసుమును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై ట్రంప్‌ (Donald Trump) సంతకం చేశారు. ఈ పరిణామం భారతీయులపై తీవ్ర ప్రభావమే చూపించనుంది. భారత్‌కు చెందిన పలు దిగ్గజ సంస్థలు అత్యధికంగా హెచ్‌-1బీ వీసాల (Visa)తోనే అమెరికాలో తమ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అటు అగ్రరాజ్య కంపెనీలు కూడా ఈ వీసాలతో ఎక్కువమంది భారతీయులను నియమించుకుంటున్నాయి.

యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (USCIS) డేటా ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం జూన్‌ 30 వరకు.. అమెరికా జారీ చేసిన మొత్తం హెచ్‌-1బీ వీసాల్లో అత్యధికంగా అమెజాన్‌ దక్కించుకుంది. ఇక, ఈ జాబితాలో భారత్‌కు చెందిన టీసీఎస్‌ (TCS) రెండో స్థానంలో ఉంది. ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా వంటి భారతీయ సంస్థలు (Indian Companies) కూడా ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande