హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.)
రేవంత్ సర్కార్ కు సోయి లేదని, పేదల బతుకులను బతుకమ్మ పండుగ రోజు నేల పాలు చేయడం అహంకారపూరిత చర్య అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గాజులరామారంలో హైడ్రా కూల్చిన పరిసర కాలనీలను ఆయన సోమవారం పరిశీలించి బాధితులకు బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గాజులరామారం విలేజ్ నందు నలభై సవంత్సరాలు క్రితం నుండి వడ్డెర క్వారీ లేబర్ క్రషర్ మిషిన్ ప్రాంతంలో నివసిస్తున్నారని అన్నారు. అయితే గతంలో ఇక్కడ ఉన్న భూములను ఎవరు పట్టించుకునే వారు కాదని అంత గుట్టలు, కొండలుగా ఉన్న భూమి కేవలం ఎకరం అయిదు వేలకు అమ్మినా ఎవరు తీసుకునే వారు లేరని తెలిపారు.
అలాంటి ప్రాంతాల్లో పేదలు, శ్రమ జీవులు గుడిసెలు వేసుకొని వారి తాతలు, తండ్రులు కాలం నుండి నివసిస్తూ ఇప్పుడిప్పుడే రూములు నిర్మించుకొని ఉంటున్నారని అన్నారు. అలాంటి పేదలు నివాసం ఉంటున్న కాలనీలలో ఓ 18,20 ఎకరాల వరకు ప్రభుత్వం భూమి ఉండొచ్చని ఎంపీ అన్నారు. అలాంటి పేదలకు నివాసం హక్కులు కల్పించడం పోయి వారి నివాసాలు కూల్చివేయడం రేవంత్ సర్కార్ కు మంచిది కాదని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..