హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.)
కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీతో పాటు కేటీఆర్ పై లగ్జరీ కార్ స్కామ్ అంటూ కీలక ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్ వేదికగా కేటీఆర్ ను ప్రశ్నిస్తూ... కార్ పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా? లగ్జరీ కార్ స్కాం నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్ లో ట్విట్టర్ టిల్లు ఎందుకు తిరుగుతున్నాడు? కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని అనుమానం వ్యక్తం చేశాడు. అలాగే ఆ కారుకు మార్కెట్ ధర చెల్లించారా? లేక తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా? పేమెంట్లు బినామీ పేర్లతో చేశారా..? ఆ డబ్బు మొత్తం నకిలీ ఆదాయమా? లేక మనీలాండరింగ్ ద్వారా వచ్చిందా అంటూ అనేక ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే ఈ స్కామ్లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కాదా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ కారు స్కామ్ కు సంబంధించిన వాస్తవాలు బయటకు రావాలి. సంబంధిత శాఖలు వెంటనే ఇన్వెస్టిగేట్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..