హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.) మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను మార్చిన సినిమా ప్రాణం ఖరీదు. ఈ సినిమా రిలీజ్ అయి... నేటికి 47 సంవత్సరాలు పూర్తయింది.
మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో పునాది రాళ్లు సినిమాకు మొదటి సంతకం చేసినప్పటికీ... ప్రాణం ఖరీదు సినిమా మొదట రిలీజ్ అయి సక్సెస్ అందుకుంది. సెప్టెంబర్ 22.. 1978 సంవత్సరంలో సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకు K వాసు దర్శకత్వం అందించగా... కథ సి ఎస్ రావు అందించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, చంద్రమోహన్ కీలక పాత్రలో కనిపించారు. అప్పట్లో రిలీజ్ అయిన ఈ సినిమా బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది.
అయితే ఈ సినిమా రిలీజ్ అయి.. 47 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో... మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయని తెలిపారు. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా, ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..