అగ్రసేన్ మహారాజ్ జయంతి.. నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.) శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ బంజారా హిల్స్ రోడ్ నెం.12లో ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దైవ నాయకుడు మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలను దేశంలోని వివిధ ప్రదేశాల్
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.)

శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతిని

పురస్కరించుకుని ఇవాళ బంజారా హిల్స్ రోడ్ నెం.12లో ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దైవ నాయకుడు మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలను దేశంలోని వివిధ ప్రదేశాల్లో రంగురంగుల ఊరేగింపులు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా జరుపుకుంటున్నారని అన్నారు. సీఎం వెంట అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, తదితరులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande