అహ్మదాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.)గుజరాత్లోని పోర్బందర్ నుంచి సొమాలియా వెళ్లే నౌకలో మంటలు చెలరేగాయి. సుభాష్ నగర్ జడ్పీ వద్ద లంగర్ వేసిన కార్గో షిప్లో సోమవారం ఉదయం మంటలు వ్యాపించాయి. దీంతో మూడు అగ్నిమాపక వాహనాలు అక్కడకు చేరుకున్నాయి. నౌకలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు.
కాగా, జామ్నగర్లోని హెచ్ఐర్ఎం అండ్ సన్స్ కంపెనీకి చెందిన ఈ నౌకలో బియ్యం బస్తాలు లోడ్ చేశారు. ఈ బస్తాలకు మంటలు వ్యాపించడంతో తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కార్గో షిప్ను సముద్రంలోకి లాక్కెళ్లారు.
మరోవైపు బియ్యం లోడ్ ఉన్న ఆ నౌక సొమాలియాలోని బొసాసోకు వెళ్లాల్సి ఉన్నదని అధికారులు తెలిపారు. అందులో మంటలు చెలరేగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు