ఖమ్మం, 22 సెప్టెంబర్ (హి.స.)
ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్, ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ... ప్రజావాణి దరఖాస్తులను జిల్లా అధికారులు తమ వద్ద పెండింగ్ లేకుండా చూడాలని, దరఖాస్తులను వెంట వెంటనే పరిష్కరించాలని అన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టేందుకు జిల్లా కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, కార్యాలయ సబార్డినేట్ ఖాళీ పోస్టుల వివరాలను వారం రోజులలో పంపాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..