అమరావతి, 22 సెప్టెంబర్ (హి.స.): ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ )ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ( కలిశారు. శాసనసభ సమావేశాల విరామ సమయంలో పవన్ ఛాంబర్‌కు వచ్చిన లోకేశ్.. ఈనెల 25న నిర్వహించే డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో జరిగిన భారీ నియామకం కావటంతో.. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేయాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. వైకాపా ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకపోగా, మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు దాదాపు 106 కేసులు వేశారని లోకేశ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు. ఏళ్ల తరబడి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కలలు సాకారం అయ్యాయని మంత్రి లోకేశ్ చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ